18-12-2025 01:04:41 AM
న్యూఢిల్లీ, డిసెంబర్ 17 : అవకాశం అన్ని వేళలా రాదు... వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటేనే భవిష్యత్తు.. ముఖ్యంగా క్రికెట్ లో అవకాశం రావడం ఎంత కష్టమే దానిని నిలబెట్టుకోవడం అంతకుమించిన కష్టం.. హఠాత్తుగా వచ్చే డబ్బు, పేరుతో కళ్లు నెత్తికెక్కితే కెరీర్ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. దీనికి అసలు సిసలు ఉదాహరణ భారత యువ క్రికెటర్ పృథ్వీ షా కెరీర్.. అండర్ 19 ప్రపంచకప్ తో తారాజువ్వాలా భారత క్రికెట్ లోకి దూసుకొచ్చాడు.
అప్పట్లో అతని టాలెంట్ చూసి సచిన్, సెహ్వాగ్ వంటి దిగ్గజాలతో పోల్చారు. మరో కోహ్లీ అవుతా డం టూ చాలా మంది అనుకున్నారు. అయితే ఎంతవేగంతో తారాజువ్వులా ఎగిసాడో.. అంతే వేగంగా పాతాళానికి పడిపోయాడు. చెడు స్నేహాలు, విలాసవంతమైన జీవితంపై ఎక్కు దృష్టి పెట్టడం, కెరీర్ పై ఫోకస్ తగ్గడం తో ఆట కూడా పాడయింది. ఫలితంగా జా తీయ జట్టుకు దూరమయ్యాడు. అతని కెప్టెన్సీలో ఆడిన గిల్, అర్షదీప్ సింగ్ స్టార్లుగా ఎదిగి టీమిండియాలో అదరగొడుతుంటే పృథ్వీ షా మాత్రం రంజీ జట్టులోనూ ప్లేస్ కోల్పోయాడు. ఐపీఎల్ లో సైతం చోటు దక్కలేదు.
2025 మెగావేలంలో అయితే అన్ సోల్‌గా మిలిగిపోయాడు. దీంతో చాలా మంది మాజీలు సైతం అతన్ని చూసి జాలిపడ్డారు. చేజేతులా కెరీర్ ను నాశనం చేసుకున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత ఆలస్యంగానైనా తన తప్పులు తెలుసుకున్న పృథ్వీ షా రెండో ఛాన్స్ కోసం ఎదురుచూస్తూ మళ్లీ ఆటపై ఫోకస్ పెట్టా డు.ముంబై జట్టుకు గుడ్ బై చెప్పి మహారాష్ట్రకు మారాడు. రంజీల్లో నిలకడగా రాణి స్తూ, దేశవాళీ టోర్నీలు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సైతం మెరుపులు మెరిపించి మళ్లీ గాడిన పడ్డాడు.
ఈ క్రమంలోనే ఐపీఎల్ వేలానికి రిజిస్టర్ చేసుకున్న పృథ్వీ షాకు మినీ వేలం ఆరంభం రౌండ్లో నిరాశే మిగిలింది. రూ.75 లక్షల కనీస ధరతో ఉన్న అతన్ని కొనేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు. గతంలో పలుసార్లు క్రమశిక్షణా రాహిత్యంతో వివాదాల్లో చిక్కుకోవడం కూడా దీనికి కారణమని చెప్పొచ్చు. మరోసారి అమ్ముడుపోనని భావించిన పృ థ్వీ షా వేలం ముగియడానికి ముందు ఇట్స్ ఓకే అంటూ హార్ట్ బ్రేక్ సింబల్స్ తో పోస్ట్ పెట్టాడు.
అయితే చివర్లో యాక్సిలిరేటెడ్ రౌండ్ 1లోనూ చుక్కెదురైంది. తర్వాత మరోసారి పృథ్వీ షా పేరును ఆక్షనీర్ పిలిచినప్పు డు ఢిల్లీ క్యాపిటల్స్ చివరి నిమిషంలో తీసుకుంది. ఈ పరిణామంతో సంతోషం వ్యక్తం చేస్తూ మునుపటి పోస్ట్ తొలగించి హార్ట్ సిం బల్ పెట్టాడు. ఒకవిధంగా ఇది పృథ్వీ షాకు చివరి అవకాశంగానే చెప్పాలి. 2018లో ఐపీఎల్లోకి అడుగుపెట్టిన ఈ యువ క్రికెటర్ ఇప్పటివరకు 79 మ్యాచ్లు ఆడి 1892 పరుగులు చేశాడు. దీనిలో 18 హాఫ్ సెంచ రీలున్నాయి. 2020, 2021, 2022 వేలానికి ముందు డీసీ అతన్ని రిటైన్ చేసుకోగా.. 2024 వరకు అదే జట్టుకు ఆడాడు.
ఫా మ్ కోల్పోవడం, ఫిట్ నెస్ సమస్య లు, క్రమశిక్షణా రాహిత్యంతో 2024లో ఢిల్లీ కూడా వదిలేసింది. ఇప్పుడు అదే ఢిల్లీ ఫ్రాంచైజీ పృథ్వీ షాకు మరో అవకాశం ఇచ్చింది. పృథ్వీ షాకు ఈ అవకాశం కనువిప్పు కావాలంటూ ఆ ఫ్రాంచైజీ ఓనర్ వ్యా ఖ్యానించారు. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని అతను నిలబెట్టుకోవాలని మాజీలు సైతం సూచిస్తు న్నారు. కేవలం ఆటపై తప్ప మరే ఇతర విషయాల వైపు వెళ్లొద్దని కోరుతున్నారు. పృథ్వీ షా జాతీయ జట్టు లోకి రావడం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యమే అయినప్పటకీ క్రమశిక్షణకు కట్టుబడి పట్టుద లతో ప్రయత్నించి సెలక్టర్ల దృష్టిలో పడితే తప్పులేదని చె ప్పొచ్చు. పృథ్వీ షా డొమెస్టిక్ కెరీర్ చూస్తే 63 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 5026 పరుగులు చేశాడు.