18-12-2025 01:01:36 AM
అడిలైడ్, డిసెంబర్ 17 : యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగు తోం ది. ఇప్పటికే తొలి రెండు టెస్టులు గెలిచి ఆధిక్యంలో ఉన్న కంగారూలు అడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో మ్యాచ్‌లోనూ అదరగొడుతున్నారు. ఆసీస్ బ్యాటర్లు తొలిరోజు రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 326 పరుగులు చేసింది. ఓపెనర్లు తక్కువ స్కోర్లకే ఔటైనప్పటకీ రీఎంట్రీ ఇచ్చిన ఉస్మాన్ ఖవాజా, అలెక్స్ క్యారీ కీలక పార్టనర్‌షిప్ నెలకొల్పారు.
మిడిలార్డర్‌ను కట్టడి చేయడంలో ఇంగ్లాండ్ బౌలర్లు విఫలమయ్యారు. ఫలితంగా అలెక్స్ క్యారీ సెంచరీతో దుమ్మురేపాడు. అటు ఖవాజా కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ 91 పరుగులు జోడించారు. ఖవాజా 82 పరుగులకు ఔటవగా..క్యారీ మాత్రం తర్వాతి బ్యాటర్లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలెక్స్ క్యారీ ఆరో వికెట్‌కు ఇంగ్లీస్‌తో కలిసి 59, ఏడో వికెట్క్ కమ్మిన్స్‌తో కలిసి 27, ఎనిమిదో వికెట్‌కు మిఛెల్ స్టార్క్‌తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యాలు సాధించాడు.
దీం తో ఆసీస్ స్కోరు 300 దాటింది. క్యారీ 106 పరుగులకు ఔటైన తర్వాత ఆసీస్ త్వరగానే ఆలౌటవుతుందని అనుకున్నారు. అయితే మిఛెల్ స్టార్క్ మరోసారి బ్యాట్‌తో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.స్టార్క్ 63 బంతుల్లో 4 ఫోర్లతో 33 రన్స్ చేశాడు. దీంతో తొలిరోజును 326/8 దగ్గర ఆసీస్ ముగించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ 3, కార్స్ 2, విల్ జాక్స్ 2 , జోష్ టంగ్ 1 వికెట్ పడగొట్టారు.