calender_icon.png 10 May, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రిలో గంజాయి పట్టివేత

10-05-2025 12:41:08 AM

రూ.40 లక్షలు విలువ గల 74 కేజీల గంజాయి పట్టివేత

భద్రాచలం, మే 9(విజయ క్రాంతి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో శుక్రవారం అక్రమంగా రవాణా అవుతున్న 74 కేజీల గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ నియంత్రణలో భాగంగా ఎక్సైజ్ సిబ్బంది డ్రైవ్ లో భాగంగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేష్  ఆదే శం మేరకు ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు  భద్రాచలం కూనవరం రోడ్డులో వద్ద రూట్ వాచ్ , వాహన తనిఖీని  నిర్వహిస్తుండగా ఓ కారులో తరలిస్తున్న 74 కేజీల గం జాయి లభ్యమైనది.

కారులో లో ఒడిశా నుండి రాజస్థాన్ తరలిస్తున్న  74 కిలోల ఎండు గంజాయి  స్వాధీనం చేసుకోవడం జరిగిందని, గంజాయి విలువ రూ 40 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అనిల్ కుమార్, ముఖేష్ పాల్వంచకు చెందిన లావుడ్య దుర్గా ప్రసాద్ అను ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు  తెలిపారు.ఈ కార్యక్రమంలో  ఏ ఈ ఎస్ తిరుప తి, ఈ ఐ రమేష్, హెచ్సి  కరీం, హెచ్సి  బా లు, తదితరులు పాల్గొన్నారు.