calender_icon.png 5 October, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడో రోజే ఖేల్ ఖతం

05-10-2025 12:30:47 AM

  1. టెస్ట్ మ్యాచ్‌లో విండీస్‌పై భారత్ ఇన్నింగ్స్ విక్టరీ
  2. టీ బ్రేక్ లోపే ముగిసిన మ్యాచ్
  3. బౌలింగ్ అదరగొట్టిన బుమ్రా, సిరాజ్ 
  4. బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మెరుపులు

అహ్మదాబాద్, అక్టోబర్ 4: అహ్మదాబా ద్ టెస్టులో టీమిండియా ఘనవిజయం సా ధించింది. ఊహించినట్టుగానే ఇన్నింగ్స్ విక్టరీని అందుకుంది. విండీస్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోవడంతో మూడోరోజు టీ బ్రేక్ లో పే మ్యాచ్‌ను ముగించింది. బ్యాటింగ్‌లో కేఎ ల్ రాహుల్, ధృవ్  జురెల్, రవీంద్ర జడేజా శతకాలతో మెరవగా, బౌలింగ్ లో సిరాజ్, జడేజా, బుమ్రా రాణించారు.

ఫలితంగా  ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. కోచ్ గంభీర్ వ్యూహంతో మూడోరోజు బ్యాటింగ్ కు దిగని  టీమిండియా ఓవర్ నైట్ స్కోర్ 448/5 దగ్గ రే తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో మూడోరోజు తొలి సెషన్ లోనే బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ఆరంభం నుంచే తడబడింది. తొలి ఇన్నింగ్స్ తరహాలోనే విండీస్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు.

పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుండడంతో రవీంద్ర జడేజా చెలరేగిపోయాడు. అటు కుల్దీప్, సిరాజ్ కూడా తలో చేయి వేయడంతో లంచ్ లోపే విండీస్ సగం జట్టు పెవిలియన్‌కు చేరింది. కేవలం 46 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిది. అయి తే అతనాజే, గ్రీవ్స్  ఆరో వికెట్ కు 46 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ భారత బౌలర్లు ఆ అవకాశం ఇవ్వకుం డా క్రమం తప్పకుండా వికెట్లు తీశారు.

చేతులెత్తేసిన బ్యాట్స్‌మెన్

విండీస్ జట్టులో అతనాజే 38, గ్రీవ్స్ 25 తప్పిస్తే మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేశారు. మధ్యాహ్నం భోజనం తర్వాత కుల్దీప్, సిరాజ్ కూడా చెలరేగిపోవడంతో విండీస్ రెండో ఇన్నింగ్స్ లో 146 పరుగులకే కుప్పకూలింది. చివర్లో లైన్ , సీల్స్ కాసేపు మెరుపులు మెరిపించడంతో ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. విండీస్ జట్టులో ఎక్కువ మందికి భారత్ పిచ్ లపై ఆడిన అనుభవం లేకపోవడంతో కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది.

భారత బౌలర్లలో జడేజా (4/54), మహ్మద్ సిరాజ్ (3/31) కుల్దీప్  యాదవ్ (2/23) , వాషింగ్టన్ సుందర్ (1/18) వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా వికెట్ తీయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ లో నూ భారత్ అదరగొట్టింది. ఆసియాకప్‌లో పలు క్యాచ్‌లు వదిలేసి విమర్శలు ఎదుర్కొన్న  టీమిండియా ప్లేయర్స్ విండీస్‌పై మాత్రం మెరుపు ఫీల్డింగ్‌తో సత్తా చాటారు.

ముఖ్యంగా చంద్రపాల్ ఇచ్చిన క్యాచ్‌ను నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతంగా అందుకోవడం హైలెట్‌గా నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడం తో పాటు బంతితోనూ అదరగొట్టిన జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లో రెండో టెస్ట్ న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా అక్టోబర్ 10 నుంచి జరుగుతుంది.

కాగా డబ్ల్యూటీ సీ 2025- సైకిల్‌లో భారత్‌కు ఇది మూ డో విజయం.  ఇటీవల ఇంగ్లాండ్ సిరీస్‌లో ఐదు టెస్టులు ఆడిన భారత్ 2- సమం చేసింది. అటు సొంతగడ్డపై కెప్టెన్‌గా గిల్‌కు ఇదే తొలి విజయం.