calender_icon.png 6 May, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లెందులో 111 కీలోల గంజాయి పట్టివేత

06-05-2025 01:00:48 AM

ఇల్లెందు, మే 5 (విజయక్రాంతి): ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా 111.754 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు ఇల్లందు డీఎస్పీ చంద్రబాను చెప్పారు. బోజ్జాయి గూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్త్స్ర శ్రీనివాస్ రెడ్డి సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా ఆటోలో తరలిస్తున్న 111.754 కేజీల గంజాయిని ఒరిస్సా నుంచి జహీరాబాద్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ.55,87,700(55.87 లక్షలు) ఉంటుందని తెలిపారు.

జహీరాబాద్ కు చెందిన రాజ్ కుమార్ రాథోడ్ ఆదేశాల మేరకు ఒరిస్సా నుంచి జహీరాబాద్ గంజాయిని తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని అన్నారు. ఈ కేసులో కేసముద్రం చెందిన సపావత్ వెంకన్న, కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కోరంపల్లి తండా చెందిన  మూడు శ్రీనివాసును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి ఆటో, మూడు సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం, జియో నెట్ రూటర్ సీజ్ చేసినట్లు తెలిపారు.

ముగ్గురు నిందితులలో ఒకరు పరారీలో ఉన్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. నిషేధిత గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. గంజాయి ని పట్టుకున్న పోలీసులను ఎస్పీ సైతం అభినందించారని తెలిపారు. ఈ సమావేశంలో సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్త్స్ర శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.