calender_icon.png 18 May, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలను ఆదుకోవడమే రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యం

18-05-2025 12:00:00 AM

-ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్

కడ్తాల్, మే 17 : పేదలను ఆదుకోవడమే రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యమని ట్రస్ట్ చైర్మన్, మాజీ జడ్పిటిసి దశరథ్ నాయక్ అన్నారు. శనివారం కడ్తాల్ మండలం మక్తమాధారం గ్రామంలో మైనార్టీ ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఆడబిడ్డ వివాహానికి రూ. 21వేల రూపాయలతో పాటు పట్టు చీర కానుకగా అందించారు.

అదే విధంగా గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడారు. రెండున్నర నెలల్లో 87మందికి రూ. 5వేల చొప్పున రూ. 4, 35లక్షలు సాయం అందించినట్లు తెలిపారు. గత ఏడాది 2116మందికి రూ. 10, 58లక్షలు పేదలకు సాయం అందించినట్లు పేర్కొన్నారు. కడ్తాల్ మండలంలో 70మంది పేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల వివాహానికి రూ. 21వేల చొప్పున 14. 70లక్షలు సహాయం ట్రస్ట్ నుంచి అందించామన్నారు.

ముద్విన్ గ్రామంలో ఓ నిరుపేద మహిళకు రూ. 10. 37లక్షలతో ఇంటి నిర్మాణం చేయించామని అన్నారు. మరో నాలుగు కుటుంబాలకు ఇళ్లను  రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అయన పేర్కొన్నారు. పేదలు ఎవరైనా సరే వాళ్ళను ఆదుకోవడమే లక్ష్యంగా తమ ట్రస్ట్ పనిచేస్తుందని దశరథ్ నాయక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి సులోచన సాయిలు, మాజీ ఎంపిటిసిలు మంజుల చంద్రమౌళి, ప్రియా రమేష్, మాజీ ఉప సర్పంచి గణేష్, బిఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు మహేందర్, జనిల్, బిక్షపతి, చందు,రమేష్ తదితరులు పాల్గొన్నారు.