calender_icon.png 14 November, 2025 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ టెన్త్ విద్యార్థులకు కిషన్‌రెడ్డి బాసట

14-11-2025 12:34:52 AM

-పరీక్ష ఫీజు నేనే కడతానన్న కేంద్ర మంత్రి

-ఎంపీగా వచ్చే వేతనంతోనే చెల్లిస్తానని వెల్లడి

-సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని విద్యార్థుల వివరాలివ్వాలి

-హైదరాబాద్ కలెక్టర్‌ను కోరిన కేంద్ర మంత్రి 

-కేంద్ర మంత్రి నిర్ణయంపై విద్యార్థుల హర్షం

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి) : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరికి ఎస్‌ఎస్‌సీ బోర్డు పరీక్ష ఫీజును తానే కడతానని కిషన్‌రెడ్డి గురువారం ప్రకటించారు.

ఈ మొత్తాన్ని ఎంపీగా తనకు వచ్చే వేతనం నుంచి భరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ అందించిన అంత్యోదయ స్ఫూర్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నటు ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ అంశంపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందనకు రాసిన లేఖను ఎక్స్‌లో షేర్ చేశారు. ఏ ఖాతాలో ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయాలనే విషయాన్ని తనకు తెలియజేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కలెక్టర్‌ను కోరారు.

అలాగే, పాఠశాలల వారీగా పదో తరగతి వివరాలు, ఎంత మొత్తాన్ని జమ చేయాలనే వివరాలను కూడా తెలియజేయాలన్నారు. పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని పదో తరగతి విద్యార్థులకు ఫీజు చెల్లిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. పరీక్ష ఫీజు చెల్లించలేక ఏ ఒక్క విద్యార్థి కూ డా విద్యకు దూరం కాకుండా చూసేందుకు కేంద్ర మంత్రులు ఇద్దరు తీసుకున్న నిర్ణయ ంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.