calender_icon.png 15 November, 2025 | 8:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వయో వృద్ధులను హింసించిన వారిపై చట్టపరమైన చర్యలు

15-11-2025 07:15:29 PM

అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య

వనపర్తి క్రైమ్: వయో వృద్ధులను హింసించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య అన్నారు. వయో వృద్ధుల అంతర్జాతీయ దినోత్సవంలో భాగంగ శనివారం మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్దుల శాఖ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుండి బాలుర కళాశాల మైదానం వరకు వాకథాన్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ముఖ్య అతిథులుగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, డీఎస్పీ వెంకటేశ్వర రావు పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ వయవృద్ధులను ఎవరు హింసించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. యువత తమ తల్లిదండ్రులపై ప్రేమ అభిమానం చూపించాలని, వృద్ధాప్యంలో వారి బాగోగులు చూడాలని సూచించారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా సీనియర్ సిటిజన్ హింసించిన, వారికి పోషణ, రక్షణ, లేని ఎడల సంబంధిత అధికారితో కేసు నమోదు చేయడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కే.సుధారాణి, వయోవృద్ధులు వయోవృద్ధుల సంఘాలు, విద్యార్థులు, ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.