06-05-2025 12:00:00 AM
కరీంనగర్ క్రైమ్, మే ౫ (విజయక్రాంతి): నగరంలో సుడా ఛెర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా డివిజన్లలో కేక్‌లు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. తెలంగాణ చౌరస్తా, మార్కెట్ రోడ్ వెంకటేశ్వర టెంపుల్ వద్ద కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. హౌజింగ్ బోర్డ్ కాలనీ అనాథ ఆశ్రమంలో 7వ డివిజన్ కాంగ్రెస్ ఇంఛార్జి వాడె వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో వృద్థులకు అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సుడా ఛెర్మన్ కోమటిరెడ్డికి పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.సుడా కార్యాయంలో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నరేందర్ రెడ్డితో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షలు ఎండీ తాజొద్దీన్, కీర్తి కుమార్, మహిళా కాంగ్రెస్ రాష్ర్ట ఉపాధ్యక్షురాలు చెర్ల పద్మ, నాయకులు అబ్దుల్ భారీ, తదితర నేతలు నరేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.నగరంలోని మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర టెంపుల్ వద్ద సుడా ఛెర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పేదలకు అన్నదానం చేశారు.
కాంగ్రెస్ నాయకులు వివేక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ అధికార ప్రతినిధి సర్ధార్ ధన్నా సింగ్, కొరివి అరుణ్ కుమార్, మన్నెంపల్లి మాజీ సర్పం మేడి అంజయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు. కరీముల్లాషా దర్గలో మైనార్టీ నాయకులు ప్రార్థన చేశారు.సుడా ఛెర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని దర్గాలో చాదర్ కప్పి ప్రార్థనలు చేశారు.
ఇందులో మసూమ్ ఖాన్, శహెన్ష, షబానా మహమ్మద్, ఇమామ్, నదిమ్ , హనీఫ్, జాఫర్ పాల్గొన్నారు. నగరంలోని 17వ డివిజన్ విద్యనగర్‌లో కొండగట్టు ఉత్సవ కమిటీ మెంబర్ వారాల నర్సింగం ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో వాకర్స్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు, 24వ డివిజన్ అంబేద్కర్ నగర్, శివాజీ నగర్‌లో కాంగ్రెస్ నాయకులు కుర్ర పోచయ్య, జీడీ రమేశ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు.