09-08-2025 10:46:19 PM
బిజెపి నాయకులు మాజీ మేయర్ వై.సునీల్ రావు..
కొత్తపల్లి (విజయక్రాంతి): అన్నా చెల్లెలు అక్కా తమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ పండుగ అని బిజెపి నాయకులు మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Former Mayor Yadagiri Sunil Rao) అన్నారు. శనివారం 33వ డివిజన్ భగత్ నగర్ లో మాజీ మేయర్ వై.సునీల్ రావుకు ఆయన సోదరీమణులతో పాటు క్యాంపు కార్యాలయంలో బ్రహ్మకుమారీలు, బీజేపీ సౌత్ జోన్ అధ్యక్షురాలు గాయత్రీ దేవి, పలువురు మహిళలు, యువతులు రాఖీని కట్టి స్వీట్ తినిపించి అన్నాచెల్లెల అక్క తమ్ముళ్ల ప్రేమానురాగాన్ని పంచుకున్నారు. నగర ప్రజలకు సునీల్ రావు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.