09-08-2025 10:44:16 PM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి...
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): గ్రామీణ వాతావరణ నేపథ్యం కలిగిన 31వ డివిజన్ ని గతపాలకులు నిర్లక్ష్యం చేశారని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) అన్నారు. శనివారం శాసనమండలి సభ్యులు బస్వరాజు సారయ్య, నగర కమిషనర్ చౌహాత్ బాజ్ పాయ్ లతో కలిసి రూ.90.50 లక్షలతో రైల్వే ట్రాక్ నుంచి పోచమ్మ ఆలయం వరకు అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఎమ్మెల్యే నాయిని ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో స్థానిక నాయకులు సమన్వయం నియోజకవర్గంలో గతంలో కంటే మెరుగైన అభివృద్ధి ఫలితాలను అందిస్తుందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి మళ్లీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో జరుగుతుందని అన్నారు. శాయంపేట పోచమ్మ ఉత్సవాలకు ప్రత్యేక విశిష్టత ఉందని, ఉత్సవాల సమయంలో భక్తులకు అసౌకర్యాలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. పనులు నిర్ణీత సమయంలో ఉత్సవాల ముందుగానే అందించాలని ఆదేశించారు. ఈ కార్పొరేటర్ మామిండ్ల రాజు, డివిజన్ అధ్యక్షులు సురేందర్, నాయకులు సత్తు రమేష్, కృష్ణ, రవీందర్, రమేష్ , సతీష్ తదితరులు పాల్గొన్నారు.