calender_icon.png 26 January, 2026 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి అజరామరం

27-09-2024 12:29:11 AM

మాజీ సీఎం కేసీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): స్వాతంత్య్ర సమరయోధుడిగా, తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాటాలు నడిపిన తొలితరం ఉద్యమ నేతగా కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి అజరామరమని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. రాజకీయవేత్తగా తెలంగాణ అస్థిత్వాన్ని చాటేందుకు బాపూజీ నడిపిన రాజీలేని పోరాటాలు తెలంగాణ సోయి కలిగిన ప్రతీ ఒక్కరికీ ఆదర్శనీయమని కొనియాడారు. బాపూజీ జయంతి సంద ర్భంగా వారి సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ సబ్బండ కులాల ఆత్మగౌరవాన్ని కాపాడటం, అన్ని రంగాల్లో వారి హక్కులకు రక్షణ కల్పించడం, వారిని స్వయంపాలనలో భాగస్వాములను చేయ డం ద్వారానే కొండా లక్ష్మణ్ బాపూజీకి మనమందించే ఘనమైన నివాళి అని కేసీఆర్ పేర్కొన్నారు.