22-09-2025 12:31:32 AM
- అభినందిస్తున్న శ్రీ వశిష్ట జూనియర్ కాలేజ్ మియాపూర్ యాజమాన్యం
- ఆనందంలో తండ్రి బూరుగడ్డ సత్యనారాయణ
పినపాక, సెప్టెంబర్ 21,(విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మద్దెల గూడెం గ్రామానికి చెందిన మన్యం బిడ్డకు నీట్ 2025 ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో ప్రభుత్వ వైద్య కళాశాల వికారాబాద్‌లో ఫ్రీ ఎంబీబీఎస్ సీటు ను సాధించాడు, వివరాలకు వెళితే పినపాక మండలం మద్దెల గూడెం గ్రామానికి చెందిన బూరుగడ్డ సత్యనారాయణ కుమారుడు బూరుగడ్డ జగదీష్ 2025 మెడికల్ ఎంట్రన్స్ లో కేటగిరి 208 ర్యాంకుతో ఉత్తీర్ణత సాధించి వికారాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ సీటును సాధించాడు.
తన తండ్రి ఒక సాధారణ వ్యవసాయ కూలీ చిన్న చిన్న వ్యవసాయ పనులు చేస్తూ, కొడుకుని ఎంబిబిఎస్ డాక్టర్ చేయా లనే తన తండ్రి కలను నిజం చేస్తూ బూరుగడ్డ జగదీష్ మెడికల్ సీట్ సాధించి తన తండ్రికి మెడికల్ సీటు రూపంలో గిఫ్ట్ ఇచ్చి వారి కుటుంబంలో ఆనందాన్ని నింపాడు.
చిన్నప్పటి నుంచి ప్రభుత్వ, చిన్నచిన్న ప్రైవేటు పాఠశాలలో విద్యను అభ్యసించిన బూరుగడ్డ జగదీష్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు, తర్వాత చిన్నచిన్న ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసాన్ని కొనసాగించారు, అనంతరం శ్రీ వశిష్ట జూనియర్ కాలేజీ మియాపూర్లో నీట్ ఎంట్రెన్స్ కోచింగ్ తీసుకొని, ప్రభుత్వ మెడికల్ కళాశాల వికారాబాద్ లో ఫ్రీ వైద్య సీటును సాధించి, ప్రతిభ ఉండాలే కానీ పేదరికం లో చదివిన విద్యార్థులు తక్కువేం కాదంటూ జగదీష్ నిరూపించాడు, కుటుంబం పేదరికంలో ఉన్నప్పటికీని మొక్కవోని దీక్షతో పట్టుదలతో తండ్రి కలను సహకారం చేస్తూ, వైద్య (ఎమ్ బి బి యస్ ) సీట్ సాధించటం ఆ కుటుంబం సంతోషించే విషయం, నీట్ 2025 ఎంట్రెన్స్ క్వాలీఫై అయ్యి ఎమ్ బి బి యస్ సీటు సాధించిన భూరుగడ్డ జగదీశ్ కుటుంబ సభ్యుల తోపాటు స్నేహితులు, వారి బంధువులు మరియు శ్రీ వశిష్ట జూనియర్ కాలేజీ మియాపూర్ యాజమాన్యం చైర్మన్ ప్రమీల రాణి, జనరల్ మేనేజర్ వంశీ చందు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉపేందర్, ప్రిన్సిపాల్ నవీంద్ర అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా బూరుగడ్డ జగదీశ్ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో కష్టపడి ఇష్టంతో చదివితేనే ఏదైనా సాధించగలమని దీని అంతటికీ శ్రీ వశిష్ట జూనియర్ కాలేజీ మియాపూర్ యాజమాన్యం అందించిన కోచింగే కారణంఅనితెలిపారు.