06-10-2025 12:00:00 AM
దౌల్తాబాద్ అక్టోబర్ 5: అఖిలా రాజ్ ఫౌండేషన్ సేవా సంస్థ మండల అధ్యక్షునిగా మండల పరిధిలోని ముబారస్ పూర్ గ్రామానికి చెందిన కోరే శేఖర్ ను ఎన్నుకున్నట్లు దుబ్బాక నియోజకవర్గం బాధ్యుడు బిట్ల భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యక్షులుగా అంతొల్ల అంజి (దొమ్మాట ), చింతకింది రాజు (మల్లేశం పల్లి ), కార్యదర్శులు గా కర్ణాకర్ (ముబారస్ పూర్) బొ ల్లం రాజేష్ (సూరంపల్లి ), కోశాధికారిగా గొల్లపల్లి ప్రేమ్ ని నియమించినట్లు తెలిపారు.
నిరుపేదలకు అండగా నిలవడమే లక్ష్యంగా, పేదరికంతో చదువుకు దూరం అవుతున్న వారిని ఆదు కో వడమే ద్వేయంగా అఖిల రాజ్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు. మండల వ్యాప్తంగా ఫౌండేషన్ సేవలు సంపూర్ణంగా అందించడానికి కమిటీని నియామకం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.