calender_icon.png 13 September, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లల్లోనూ పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

13-09-2025 12:53:03 AM

-లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దు

-కామినేని ఆస్పత్రి క్యాన్సర్ నిపుణుల సూచన

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): దేశంలో చిన్న పిల్లల్లో కూడా క్యాన్సర్ కేసులు ఎక్కువ అవుతున్నాయని, ఏటా కనీసం 5,0-75 కొత్త కేసులు నమోదవుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య 4 లక్షలకు పైగా ఉంటోందని, 2030 నాటికి ఈ సంఖ్య ఏకంగా 2 కోట్ల వరకు చేరుకోవచ్చని పరిశోధకుల అం చనా. అయితే ఏటా సెప్టెంబర్ మాసాన్ని పిల్లల క్యాన్సర్ అవగాహన మాసంగా నిర్వహిస్తారు.

ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ కామి నేని ఆస్పత్రికి చెందిన పలువురు వైద్య నిపుణులు శుక్రవారం పిల్లల్లో క్యాన్సర్‌పై అవగా హన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రిలో జెనెటిక్స్, మాలిక్యులర్ మెడిసిన్ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అనీ క్యూ హసన్ మాట్లాడుతూ, “పిల్లల్లో ప్రధానంగా లుకేమియా, లింఫోమా, కేంద్రనాడీ వ్యవస్థలో కణితులు ఉంటున్నాయి. కొన్నిరకాల పరిస్థితుల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉం టుంది. అనుమానించినప్పుడు వారికి జన్యుపరమైన పరీక్షలు చేస్తే కొన్ని రకాల క్యాన్స ర్లను ప్రాథమిక దశలోనే గుర్తించగలం. అలా గుర్తిస్తే అప్పుడు వారిని చికిత్సకు పం పుతాం” అని వివరించారు.

కన్సల్టెంట్ పీడియాట్రీషియన్, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ కంచన్ ఎస్ చన్నావర్ మాట్లాడుతూ, “పిల్లలు పుట్టకముందే వారు పిండం దశలో ఉండగానే కొన్ని రకాల కణాలు క్యాన్సర్ కణితులుగా రూపాంతరం చెందుతాయి. అవి ఎంత వేగంగా పెరిగితే అంత చిన్న వయసులో క్యాన్సర్ బయటపడుతుంది. వారిలో ఎక్కువగా లుకేమియా, లింఫోమాలు వస్తా యి. పెద్దల క్యాన్సర్ చికిత్సలో స్పందన అం త త్వరగా ఉండదు గానీ, కెమోథెరపీ లాంటి వాటికి పిల్లల శరీరం త్వరగా స్పందిస్తుంది.

లాగే పిల్లలు త్వరగా కోలుకుని తమ దైనందిన జీవితం బాగా గడపొచ్చు” అన్నారు. కామినేని ఆస్పత్రిలోని మెడికల్ ఆంకాలజిస్ట్ ఎస్. జయంతి మాట్లాడుతూ, “ పిల్లలకు నొప్పి లేని కంతులు గాని, కడుపులో గట్టిగ తగలడం గాని, జ్వరం, బరువు తగ్గడం, తలనొప్పి, వాంతులు, కనుగుడ్లు తెల్లగా మార డం, రక్తస్రావం గాని ఉంటే వైద్యులని సంప్రదించాలి. తగిన పరీక్షలు చేసిన తర్వాత నిర్దా రణ చేస్తారు. లక్షణాలను త్వరగా గుర్తించగలిగితే పిల్లల క్యాన్సర్లను చాలావరకు తగ్గిం చవచ్చు” అన్నారు. కామినేని ఆస్పత్రిలో అన్నిరకాల క్యాన్సర్లకు నిర్ధారణ పరీక్షలు, పలు రకాల చికిత్సలు అందుబాటులో ఉ న్నాయి. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఉచితంగా కూడా వీటికి చికిత్సలు అందిస్తారు. పిల్లలకు ఎలాంటి లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు అప్రమత్తం కావాలని సూచించారు.