calender_icon.png 6 May, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలం బార్ అధ్యక్షులుగా కోట దేవదానం

27-03-2025 10:28:18 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం బార్ అసోసియేషన్ ఎన్నికలలో కౌంటింగ్ ప్రక్రియ గురువారం పూర్తి అయినది. ఈరోజు జరిగిన ఎన్నికలలో నూతన కార్యవర్గాన్ని ఎన్నికల ద్వారా ఎన్నుకున్నారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి కోటా దేవదానం, చైతన్యలు పోటీ పడగా ఆరు ఓట్ల తేడాలో కోటా దేవదానం విజయం సాధించారు. దేవదానంకు 51 ఓట్లు రాగా, చైతన్యకు 44 వచ్చినట్లు ఎన్నికల అధికారి కొడాలి శ్రీనివాస్ తెలియజేశారు. వైస్ ప్రెసిడెంట్  గా సున్నం రమేష్, జనరల్ సెక్రెటరీ పి శ్రీనివాసచారి, జాయింట్ సెక్రెటరీ బి శారద, ట్రెజరర్ గా పి నాగరాజు, లైబ్రరీ సెక్రెటరీ సిహెచ్ హనుమంతరావు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ గా బి రాంప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లేడీస్ రిప్రజెంటేటివ్ గా ఎం తరుణ్ ఏకగ్రీవంగా ఎన్నికల అధికారి పడాలి శ్రీనివాస్ తెలియజేశారు. భద్రాచలం బార్ అసోసియేషన్ ఎన్నికల ఎన్నికలు సజావుగా జరిపించి ప్రక్రియ పూర్తిచేసిన ఎన్నికల అధికారి కొడాలి శ్రీనివాస్, శ్రీమన్నారాయణ, వారికి సహకరించిన విజ్జగిరి రవితేజకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపటం జరిగింది.