calender_icon.png 5 May, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ మంత్రి కుటుంబాన్ని కలిసిన ఎమ్మెల్సీ కవిత

28-03-2025 12:00:00 AM

ఆదిలాబాద్, మార్చి 27 (విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న కుటుంబాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురా లు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని జోగు రామన్న నివాసానికి గురువారం చేరుకున్న కవితకు రామన్న కుటుంబ సభ్యులు స్వాగ తం పలికి, శాలువాతో ఘనంగా సత్కరించా రు.

అనంతరం పలు అంశాలపై చర్చించా రు. ప్రస్తుతం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యం లో కొనసాగుతున్న రిలే దీక్షల గురించి రామన్నని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్‌ఎస్ పార్టీ పక్షాన ఒత్తిడి పెంచుతామన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, యువ నాయకులు జోగు మహేందర్, రంగినేని శ్రీనివాస్, గోపి ఉన్నారు.