calender_icon.png 16 August, 2025 | 3:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త చైర్మన్‌గా ‘కొత్తపల్లి’ జైపాల్‌రెడ్డి

16-08-2025 12:40:00 AM

 బాటసింగారం సహకార బ్యాంక్ బాధ్యతలు స్వీకరణ

 రైతులకు అన్నీ విధాలా ఆదుకుంటాం: జైపాల్‌రెడ్డి

అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 15: బాటసింగారం సహకార బ్యాంక్ కొత్త చైర్మన్‌గా “కొత్తపల్లి జైపాల్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చైర్మన్ జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. బాటసింగారం సహకార బ్యాంక్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని అన్నారు. రైతులకు అన్నీ విధాలా సహాయ, సహకారాలు అందజేస్తానని అన్నారు. గతంలో బాటసింగారం చైర్మన్‌గా కొనసాగిన చేగూరి భరత్‌కుమార్‌పై జిల్లా సహకార అధికారులు వేటు వేసి.. పదవీ నుంచి తొలగించారు.

పాలకవర్గం తీర్మానాలకు విరుద్ధంగా..తన వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటున్నాడని, రుణాల మాఫీ విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ.. పలువురు మాజీ సర్పంచ్‌లు ఈ నెల 11న ఆయనపై సహకార జిల్లా శాఖ అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన.. చేగూరి భరత్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలడంతో అతనిపై వేటు వేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సహకార, జిల్లా సహకార బ్యాంకుల పాలకవర్గ పదవీకాలం మరో ఆరు నెలల పొడిగిస్తున్నట్లు గురువారం నిర్ణయం తీసుకుంది. గత చైర్మన్ చేగూరి భరత్ కుమార్‌ను పదవీ నుంచి తొలగించడంతో.. బాటసింగారం సహకార బ్యాంక్ చైర్మన్‌గా కొత్తపల్లి జెపాల్‌రెడ్డికి బాధ్యతలుఅప్పజెప్పారు.