calender_icon.png 17 August, 2025 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

16-08-2025 12:39:46 AM

ప్రారంభించిన దేవాదాయ శాఖ మంత్రి  కొండా సురేఖ , ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట ఆగస్టు 15 (విజయక్రాంతి): శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని గౌరవ దేవాదాయ మంత్రివర్యులు కొండా సురేఖ గారు , ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయ ఈవో వెంకట్రావు గారు మరియు ఆలయ సిబ్బంది అర్చకులు ఘన స్వాగతం పలికి స్వామివారి జ్ఞాపికని బహుకరించారు  అనంతరం శ్రీ యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక ఆవిష్కరించారు.

దేవాలయానికి సంబంధించిన పూర్తి కార్యక్రమాలు పూజా వివరాలు ఈ పత్రిక ద్వారా ఆధ్యాత్మికత పెంపొందించేలా ఉంటుందని తెలిపారు. రాబోయే రోజుల్లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో వేద పాఠశాల ఏర్పాటు ఏర్పాటు చేయుటకు ప్రతిపాదనలు ఉన్నట్టు తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులు వృద్ధులకు చిన్న పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు దానికి అనుగుణంగా పోలీస్ వారికి దేవస్థాన సిబ్బందికి తగిన జాగ్రత్తలు తెలియజేశారు.

దర్శనానికి వచ్చే భక్తులు అనంతరం సేదతీరేలా డార్మెటరీ హాల్ ఈ ప్రభుత్వంలో ప్రారంభించిన ప్రారంభించినట్లు చెప్పారు. ముందు రోజుల్లో కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తున్నట్టు, భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్టు చెప్పారు. స్వామివారి సన్నిధికి వచ్చేవారు సంతోషంగా ఉండడానికి అన్ని రకాల ఏర్పాట్లకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

ఈ ఆఫీస్ లాంచ్ దేవస్థానం నందు అన్ని పరిపాలనా కార్య్ర కమంలో పేపర్లేకుండా డిజిటల్ విధానంలో అమలు పరిచేలా ఈ ఆఫీస్ ని ప్రారం భించారు. దీనిలో భాగంగా దేవస్థానం కు సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఇందులో ఉంటాయి. ద్వారా పూర్తి పారదర్శకమైన విలువలతో కూడిన విధానం ఉంటుందని తెలిపారు. 

శ్రీ గరుడ ట్రస్ట్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం తరుపున విద్యా వైద్యము నిత్య ప్రసాద వితరణ విరాళంలో అన్నీ కలిపి ఒకే ట్రస్ట్ గా ఏర్పాటు చేశారు దానికి శ్రీ గరుడ ట్రస్ట్ గా నామకరణం చేసి ప్రారంభించారు. గరుడ ట్రస్ట్ ఎవరైనా భక్తులు విరాళంలో వచ్చిన పిదప వారికి డబ్బు ఉపయోగించిన వివరాలు లెటర్ ద్వారా తెలియజేస్తామని తెలిపారు.

ప్రతి రూపాయి పారదర్శకంగా ఉంటుందని దేవస్థానం తరుపున జరిపే విద్యా కార్యక్రమాలు వైద్య కార్యక్రమాలు నిత్య ప్రసాద వితరణ కార్యక్రమాలు అన్నిటిని గరుడా ట్రస్ట్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. 

 ఉచితంగా వరలక్ష్మీ వ్రతం 

మహిళా భక్తుల కొరకు ఏర్పాటుచేసిన వరలక్ష్మీ వ్రతం లో లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో కొండ కింద గల సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అమ్మవారి ప్రసాదంగా పసుపు కుంకుమ అందజేశారు.