24-07-2025 08:17:38 PM
మామిడి రామారావు ఖర్చులతో చిన్నారులకు చెక్కుల అందజేత..
కోదాడ: కోదాడ మున్సిపాలిటీ(Kodada Municipality) పరిధిలోని కొమరబండ గ్రామంలో కేటీఆర్(KTR) పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయుకుడు మామిడి రామారావు ఘనంగా గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హాజరయ్యారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కోమరబండలో కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా జులై నేలలో జన్మించిన 12 మంది చిన్నారులకు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చొప్పున పోస్ట్ ఆఫీస్ ఖాతాలో జమ చేసి చెక్కుల్ని అందజేశారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు మామిడి రామారావు తన సొంత డబ్బులతో చిన్నారులకు చెక్కులను అందజేసిన్నదుకు కేటీఆర్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపినట్లు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు. రానున్న రోజుల్లో కేటీఆర్ ముఖ్యమంత్రి కావడంతో ఖాయమన్నారు. ముందుగా కేటీఆర్ జన్మదిన వేడుకలు సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు నాయకులకు గ్రామస్తులకు కేక్ పంచిపెట్టారు. నాయకులు సత్తిబాబు, అలవాల వెంకట్, మేదర్ లలిత, నయీం, కందుల చంద్రశేఖర్, అనంతు సైదయ్య, ఇమ్రాన్, సీతయ్య, కె వీరబాబు, వెంకటనారాయణ, నాగులు, నరేష్, అరుణ్, గోపి పాల్గొన్నారు.