calender_icon.png 31 July, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడల్ స్కూల్ సమస్యలు పరిష్కరించాలి

24-07-2025 08:13:36 PM

జయశంకర్ భూపాలపల్లి/మహబూబాబాద్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) గణపురం మండలంలోని మోడల్ స్కూల్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్లో 400 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యానభ్యసిస్తుండగా సరైన మరుగుదొడ్లు లేవని, రహదారి నిర్మాణం శంకుస్థాపనకే పరిమితమైందని, పేద విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో దశల వారి ఆందోళనను చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పి.లక్ష్మీ నరసింహారావు, పిఎసిఎస్ మాజీ చైర్మన్ పి. పూర్ణచంద్రారెడ్డి, చెల్పూర్ మాజీ సర్పంచ్ మధు సూదన రావు, నాయకులు కుమారస్వామి గౌడ్, శ్రీనివాసరావు, రవీందర్, కృష్ణస్వామి, శ్రీధర్ పాల్గొన్నారు.