04-12-2024 03:37:14 PM
హైదరాబాద్: కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మార్చొద్దని బుధవారం నాడు తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం గల రాష్ట్రం తెలంగాణ అన్నారు. మూర్తీభవించిన స్త్రీగా తెలంగాణ తల్లిని కేసీఆర్ రూపొందించారని కేటీఆర్ సూచించారు. తెలంగాణ తల్లి రూపు మార్చే ఆలోచనను మానుకోవాలన్నారు. భరతమాత రూపాన్ని వాజ్ పేయి మార్చలేదు కదా.. తెలంగాణ తల్లి రూపాన్ని.. తర్వాత వచ్చిన ఏ సీఎం మార్చలేదని కేటీఆర్ వెల్లడించారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఉన్నచోట తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం.. తెలంగాణ చరిత్రపై మరిన్ని పుస్తకాలు రావాల్సిఉందని కేటీఆర్ పేర్కొన్నారు.