13-12-2024 02:16:57 PM
హైదరాబాద్: 'పుష్ప 2: ది రైజ్' ప్రీమియర్ షోలో ఒక మహిళ మరణించిన కేసులో నటుడు అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడాన్ని భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఖండించారు. అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్న తీరుపై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. అల్లు అర్జున్ ను సాధారణ నేరస్థుడిలా చూడడం సరికాదని చెప్పారు. పాలకుల అభద్రతా భావానికి అల్లు అర్జున్ అరెస్టు తీరు నిర్శనం అన్నారు. జాతీయ ఉత్తమ నటుడి అరెస్టు పాలకుల అభద్రతకు నిదర్శనమి కేటీఆర్ పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదు అని కేటీఆర్ తెలిపారు. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ బాధ్యుడని అరెస్టు చేశారు. అదే దిక్కుమాలిన లాజిక్‌తో వెళితే, హైదరాబాద్‌లో హైడ్రా చేసిన భయం సైకోసిస్‌తో మరణించిన ఇద్దరు అమాయకుల మరణానికి కారణమైన రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ శుక్రవారం మధ్యాహ్నం కట్టుదిట్టమైన భద్రత మధ్య, అతని నివాసం నుండి అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.