calender_icon.png 21 January, 2026 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంగుల కమలాకర్ ను పరామర్శించిన కేటీఆర్

25-10-2024 11:37:01 AM

కరీంనగర్, (విజయక్రాంతి): మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుటుంబాన్ని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారకరామారావు గురువారం రాత్రి పరామర్శించారు. ఇటీవల కమలాకర్ మాతృమూర్తి పరమపదించారు, తొలుత నర్సమ్మ చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళీలు అర్పించారు. కార్యక్రమంలో ఎంపి వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మేయర్ సునీల్ రావు, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జి వి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.