02-09-2025 12:00:00 AM
చర్ల, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి ఆర్ భద్రాచలం నియోజకవర్గం కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ చర్ల మండల కన్వీనర్ దొడ్డి తాతారావు కోరారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 11న బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు (కేటీఆర్) భద్రాచలం నియోజక వర్గంలో పర్యటించనున్నారు.
త్వరలో రాబోయే స్థానిక సంస ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అతి త్వరలో భద్రాచలం నియోజకవర్గంలో ఉప ఎన్నిక రాబోతోంది. ఉప ఎన్నికలో బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని, భద్రాచలం లో మళ్లీ గులాబి జెండాను ఎగురవేయాలి అని కార్యకర్తలను కోరారు. కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యం కానీ హామీలు అనే వర్గాల ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో మండల కో కన్వీనర్ ఐనవోలు పవన్ కుమార్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ ,గొర్ల రాజబాబు, ఏనాటి జనార్ధన్ దినసరపు భాస్కర్ రెడ్డి పంజా రాజు డివిజన్ యూత్ నాయకులు కాకి అనిల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుంభతిని రాము ఎస్టీ సెల్ అధ్యక్షులు తుర్రం రవి మహిళా ఉపాధ్యక్షురాలు కుప్పాల సౌజన్య ఎస్టీ సెల్ కార్యదర్శి కోరం కన్నారావు మండల యూత్ అధ్యక్ష కార్యదర్శులు అంబోజీ సతీష్ కుప్పాల నిరంజన్ తడికల బుల్లెబ్బాయి సిద్ది రాజశేఖర్ బట్ట కొమరయ్య గుమ్మల నరేంద్ర తడికల చంద్రశేఖర్ మునిగల సాంబ సిద్ధి సంతోష్ సిద్ది కిరణ్ తదితరులు పాల్గొన్నారు