calender_icon.png 8 September, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనురాగ్ యూనివర్సిటీలో ముగిసిన వర్క్ షాప్

02-09-2025 12:00:00 AM

ఘట్ కేసర్, సెప్టెంబర్ 1 : ఘట్ కేసర్ మున్సిపల్ వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్శిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలోని క్యాడ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమం ఫ్రమ్ కాన్సెపట్స్ టు క్రియేషన్ హాండ్స్ ఆన్ సెషన్ ఆన్ కాటియా  ముగిసినది. ఈ కార్యక్రమంలో ఎస్. నాగరాజు బ్రాంచ్ మేనేజర్ కాంటర్ కాడ్ హబ్సిగూడ, క్లస్టర్ ట్రెయినర్స్ సమీర్, లహరి ప్రియ లచే క్యాటియా సాఫ్ట్వేర్ యొక్క అప్లికేషన్ల పై సుమారు యాభై మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు.

ఈ కార్యక్రమాన్ని కాడ్ క్లబ్ ఫ్యాకల్టీ కో- ఆర్డినేటర్ డాక్టర్  పి. సరిత సమన్వయం చేశారు. ఈసందర్భంగా విద్యార్థులు వర్క్ షాప్ నిర్వహణకు అవకాశం కల్పించిన డీన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డాక్టర్ వి. విజయ్ కుమార్, అసోసియేట్ డీన్,  మెకానికల్ విభాగం హెడ్ డాక్టర్ శ్రీనివాస చలపతి, అనురాగ్ యునివర్సిటీ మేనేజ్మెంట్ కాంటర్ కాడ్ సంస్థ మేనేజ్మెంట్ కు కృతజ్ఞతలు చెప్పారు.