calender_icon.png 13 October, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుల్దీప్ పాంచ్ పటాకా

13-10-2025 01:12:46 AM

ఫాలోఆన్‌లో విండీస్ పోరాటం

-కాంప్‌బెల్, హోప్ హాఫ్ సెంచరీలు 

-మూడోరోజు వెస్టిండీస్ స్కోర్ 173/2

న్యూఢిల్లీ,అక్టోబర్ 12 :న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ పోరాడుతోంది. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. మూడో రోజు తొలి రెండు సెషన్లలో భారత్ ఆధిపత్యం కనబరిస్తే.. చివరి సెషన్‌లో మాత్రం కరేబియ న్లు పుంజుకున్నారు. కుల్దీప్ దెబ్బకు ఫాలో ఆన్‌లో పడిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం పట్టుదల కనబరిచి మూడోరోజును ముగించింది.

4 వికెట్లకు 140 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మూడోరోజు ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్ త్వరగానే మరో 4 వికెట్లు చేజార్చుకుంది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తొలి స్పెల్‌లోనే విండీస్‌ను దెబ్బతీశాడు. కీలకమైన హోప్ వికెట్‌ను తీసుకు న్నాడు. తర్వాత టెవిన్‌ను కూడా ఔట్ చేయడంతో విండీస్ ఇన్నింగ్స్ త్వరగానే ముగుస్తుందనిపించింది.

అయితే చివర్లో టెయి లెండర్లు పియరీ, ఫిలిప్ జోడీ అద్భుత పోరా టం చేశారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదు ర్కొం టూ స్కోర్ 200 దాటించారు. వీరి జోడీని భారత బౌల ర్లు త్వరగా విడగొట్టలేకపోవ డంతో లంచ్ బ్రేక్ కు విండీస్ 217/8 పరుగులకు చేరిం ది. కానీ లం చ్ తర్వాత భారత బౌలర్లు విండీస్ ఇన్నింగ్స్‌ను ముగించారు. పియరీని బుమ్రా బౌల్డ్ చేసి తొమ్మి దో వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు.

తర్వాత సీల్స్, ఫిలిప్ 27 రన్స్ జోడించగా.. చివరి వికెట్‌ను కుల్దీప్ పడగొట్టాడు. దీంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌కు 248 పరుగుల దగ్గర తెరపింది. కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు పడగొట్టగా.. జడేజా 3, బుమ్రా , సిరాజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. 270 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకున్న టీమిండియా విండీస్‌కు ఫాలో ఆన్ ఇచ్చింది.

ఫాలోఆన్‌లోనూ విండీస్ తడబడింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే చంద్రపాల్(10),అతనాజే(7) ఔటవడంతో 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. దీంతో విండీస్ ఇన్నింగ్స్ మూడోరోజే ముగిసేలా కనిపించింది. ఈ దశలో ఓపెనర్ కాంప్‌బెల్, షై హోప్ అసాధారణ పోరాటం చేశారు. భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ క్రీజులో నిలిచారు.

వీరిద్దరి కారణంగానే చివరి సెషన్‌లో విండీస్‌దే పైచేయిగా నిలిచింది. చూస్తుండగానే హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న కాంప్‌బెల్, హోప్ 138 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి జోడీని విడదీ సేందుకు భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఫీల్డింగ్‌లో కొన్ని తప్పిదాలు కూడా విండీస్ బ్యాటర్లకు కలిసొచ్చాయి.

దీంతో మూడోరోజు ఆటముగిసే సమయానికి వెస్టిండీస్ 2 వికెట్లకు 173 పరుగులు చేసింది. కాంప్‌బెల్ 87(9 ఫోర్లు, 2 సిక్స్‌లు), షై హోప్ 66( 8 ఫోర్లు, 2 సిక్స్‌లు)క్రీజులో ఉన్నారు. ఈ సిరీస్‌లో విండీస్ బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం విండీస్ ఇంకా 97 పరుగులు వెనుకబడి ఉంది. ఇంకా రెండురోజుల ఆటమిగిలి ఉన్న నేపథ్యంలో నాలుగోరోజు విండీస్ ఎంతవరకూ పోరాడుతుందనేది చూడాలి. భారత్ బౌలర్లు నాలుగోరోజు తొలి సెషన్‌లో చెలరేగితే మాత్రం మ్యాచ్ సోమవారమే ముగిస అవకాశాలున్నాయి

స్కోర్లు :

భారత్ తొలి ఇన్నింగ్స్  : 518/5 డిక్లేర్డ్

వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్  : 248 ఆలౌట్ (అతనాజే 41, హోప్ 35, చంద్రపాల్ 34; కుల్దీప్ 5/82,జడేజా 3/46)

వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్  : 173/2 ( కాంప్‌బెల్ 87 బ్యాటింగ్, హోప్ 66 బ్యాటింగ్; సిరాజ్ 1/10, వాషింగ్టన్ సుందర్ 1/44)