28-08-2025 06:15:46 PM
బోథ్ (విజయక్రాంతి): జిల్లాలో పలువురు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ ఇటీవల ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే బోథ్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు(Junior Civil Judge Court)కు బదిలీపై వచ్చిన నూతన న్యాయమూర్తి కుంభ సందీప్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ మౌనిక ఇన్చార్జి జడ్జిగా వ్యవహరించారు. కాగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జడ్జి సందీప్ కు బోథ్ అడ్వకేట్లు ఘనంగా స్వాగతం పలికారు.