28-08-2025 06:23:38 PM
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ 57వ డివిజన్ కు చెందిన ఎలకంటి హనిష్ మాన్య మట్టి వినాయకుడిని తయారు చేశాడు. వినాయకుడు ఎడమ పక్కన శివలింగం, కుడి పక్కన పూరి జగన్నాథ్ విగ్రహాలను ఏర్పాటు చేశాడు. తలపాగతో వినాయకుడు దర్శనమిస్తున్నాడు. మట్టి విగ్రహాలను పూజించడం వల్ల పర్యావరణాన్ని కాపాడుతామని, నీటిలో జలచరాలకు ఇబ్బంది కాకుండా ఉంటుందని హనీష్ మాన్య అన్నారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుని పోయిన ఈ విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది.