calender_icon.png 29 August, 2025 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపిక

28-08-2025 06:12:40 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే కళాశాల(Mahatma Jyotiba Phule College)కి చెందిన డ్యానిష్, అఖిల్ అనే విద్యార్థులు ఎంపికయ్యారని గురువారం ప్రిన్సిపాల్ మంగ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు ఆగస్టు 30, 31 తేదీల్లో మహబూబ్నగర్ లో జరుగుతాయని తెలిపారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏటీపీ తిరుమల్, పీడీ, పీఈటీలు నాంపల్లి, రాజేశ్ పాల్గొన్నారు.