15-08-2025 01:54:10 AM
ములకలపల్లి, ఆగస్టు 14(విజయక్రాంతి): కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల బృందం సేద్య విభాగపు శాస్త్రవేత్త డాక్టర్ టి.భరత్, విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్. హేమశరత్చంద్ర, ఉద్యాన శాస్త్రవేత్త బి.శివ, వ్యవసాయ అధికారి అరుణ్ బాబు, వ్యవసాయ విస్తరణ అధికారులు రమేష్, రజనీకాంత్ గురువారం మండలంలోని జగన్నాథపురం, సీతయ్యగూడెం, కమలాపురం గ్రామం లో వరి, పత్తి, మొక్కజొన్న, ఆయిల్ పామ్ వంటి పంటలను పరిశీలించారు.
పత్తి పంటలో నీరు నిల్వకుండా చూసుకోవాలని సంచించారు. అధిక తేమతో వేరుకుళ్లు, మెగ్నీషియం ధాతు లోపం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వేరుకుళ్లు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి లేదా కార్బండిజమ్ 1 గ్రాము లీటర్ నిటికి కలిపి ప్రత్తి మొక్కలు గుంపులు గుంపు లుగా చనిపోయిన ప్రదేశాల్లో మొక్కల మొదళ్లలో పోయాలని పేర్కొన్నారు. అధిక తేమ ఉన్న పరిస్థితుల్లో మొక్క పోషకాలను తీసుకోలేదు కాబట్టి 19:19:19 లేదా మల్టీకే 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకోవాలని చెప్పారు.
వెదజల్లే పద్ధతిలో విత్తిన వరి క్షేత్రాన్ని పరిశీలించి, కలుపు నివారణకు స్టైలోపాప్బ్యూటైల్ పెనాక్సులమ్ లీటర్ కలుపు మందును, 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. ఏక వార్షిక పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ వంటి బహువార్షిక పంటలు నంవత్సరానికి పది రెట్లు ఎక్కువ ఆదాయం ఇచ్చినవ్చటికి, మొక్కలు నాటిన మొదలు కాపుకు రావడానికి మూడేళ్లకు పైగా సమయం పడుతుందని అంతవరకు తోటనుండి రైతుకు అదాయం ఉండదు పైగా రైతుకు ప్రతి సంవత్సరం నీటిపారుదల, ఎరువులు, సస్యరక్షణ చర్యలు, కలుపు నివారణ మరియు ఇతరేతర యాజ మాన్యం తప్పదు కావున రైతులు తోటల్లో మొక్కలు కాపుకు వచ్చేంత వరకు వాటిమధ్య మునగ, బొప్పాయి, అరటి వంటి పంటలను అంతర వంటలు వేసుకొని వాణిజ్యపరంగా, సమర్ధవం తంగా వినియోగించుకొని అదాయం పొందాలని సూచించారు. కార్యక్రమంలో 20 మంది రైతులు పాల్గొన్నారు.