17-05-2025 07:28:12 PM
ఫీల్డ్ అసిస్టెంట్ నిర్లక్ష్యం..
కొల్చారం (విజయక్రాంతి): ఉపాధి హామీ కూలీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఫీల్డ్ అసిస్టెంట్ పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో గందరగోళం ఫీల్డ్ అసిస్టెంట్ నిర్లక్ష్యం వల్ల పనులు చేపట్టకుండా వెనక్కి తిరిగిన వెళ్లిన ఉపాధి హామీ కూలీలు వెంకటాపూర్ గ్రామంలో సుమారు 150 మంది కూలీలు ప్రతిరోజు ఉపాధి హామీ పనిచేయడం జరుగుతుంది.
ఉదయం 7 గంటలకు వెళ్లి 11 గంటల వరకు పనిచేసుకొని హాజరు కోసం వేచి ఉండాలి హాజరు తీసుకోమని ఫీల్డ్ అసిస్టెంట్ ను అడుగగా ఇంకా టైం కాలేదని కాలక్షేపం చేస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. 11 తర్వాత కూడా కూలీలను పని దగ్గర్నే కూర్చోబెట్టడం జరుగుతుంది కూలీలుకు ఉపాధి హామీ పనుల వద్ద ఉదయం నుంచి తాగునీరు లేవు, గ్లూకోస్ పౌడర్ లేవు, ఎండ తాకిడికి షామియానాలు కూడా వేయించడం లేదని కనీస సౌకర్యాలు లేక ఉపాధి హామీలు కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. పనిచేసిన పనికి తగిన వేతనం రావడంలేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి ఫీల్డ్ అసిస్టెంట్ పై తగు చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు.