calender_icon.png 4 November, 2025 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టు భవనం మరమ్మతుకు రూ.15 లక్షలు కేటాయిస్తా..

04-11-2025 01:49:40 AM

మెదక్ ఎంపీ రఘునందన్ రావు

తూప్రాన్, అక్టోబర్ 3 : తూప్రాన్ కోర్టు భవన మరమ్మతుకు తన ఎంపీ నిధుల నుండి రూ.15 లక్షలు కేటాయిస్తున్నట్లు మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు తెలిపారు. కోర్టు భువన ఏర్పాటుపై ఆయనను కలిసిన తూప్రాన్ న్యాయవాదుల బృందంతో మాట్లాడారు. తూప్రాన్ న్యాయవాదులు సోమవారం ఎంపీని మర్యాద పూర్వకంగా కలసి, తూప్రాన్లోని కోర్టు భవనాని కి అవసరమైన మరమ్మత్తులపై చర్చించారు.

తూప్రాన్ లోని పాత మండల పరిషత్ కార్యాలయాన్ని కోర్టు భవనంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఆ భవనానికి కావలసిన మరమ్మత్తుల అంశంపై ఎంపీకి న్యాయవాదులు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ వెంటనే సానుకూలంగా స్పందించి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి భవన పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఎంపీ లాడ్స్ నిధుల నుండి రూ.15 లక్షలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో న్యాయవాదులు శ్రీనివాస్, అశోక్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.