calender_icon.png 20 October, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫార్మాస్యూటికల్ పరిశోధనలో డాక్టర్ లక్ష్మీదేవికి పీహెచ్డీ

18-10-2025 07:55:32 PM

పటాన్ చెరు: ఫార్మాస్యూటికల్ పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థిని జి.లక్ష్మీదేవిని డాక్టరేట్ వరించింది. రెట్రోవైరల్ వ్యతిరేక మందుల సులువుగా మింగడం కోసం సూత్రీకరణ, అభివృద్ధి, ఘన వ్యాప్తి యొక్క తులనాత్మక మూల్యాంకనం, నానోసస్పెన్షన్స్, సెల్ఫ్-నానోఎమల్సిఫైయింగ్ డెలివరీ సిస్టమ్స్ (SNEDDS)పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న ఫార్మసీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పాతూరి రఘువీర్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. 

డాక్టర్ లక్ష్మీదేవి వినూత్న సూత్రీకరణ పద్ధతుల ద్వారా డోలుటెగ్రావిర్ (డీటీజీ) యొక్క ద్రావణీయత, జీవ లభ్యతను మెరుగుపరచడంపై దృష్టి సారించినట్టు తెలియజేశారు. ఘన వ్యాప్తి, నానోసస్పెన్షన్స్, SNEDDS వంటి అధునాతన ఔషధ పంపిణీ వ్యవస్థలు డీటీజీ యొక్క కరగడం, చికిత్సా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయని ఆమె పరిశోధన విజయవంతంగా నిరూపించిందన్నారు. డాక్టర్ లక్ష్మీదేవి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, పలు విభాగాల అధిపతులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.