బీసీ రిజర్వేషన్లపై కేంద్ర వైఖరికి నిరసనగా సిపిఎం ర్యాలీ
రహదారిపై రాస్తారోకో
మణుగూరు (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లకు, కేంద్ర వైఖరికి నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ లో రాస్తారోకో చేపట్టారు. అనంతరం సిపిఎం మండల కార్యదర్శి సత్రపల్లి సాంబశివరావు మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించవలసిన గవర్నర్ కేంద్రానికి అనుకూలంగా ఉంటున్నారని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బిజెపి బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటూ, బీసీ జేఏసీ బందులో పాల్గొనడం ఏమిటని ప్రశ్నించారు. బిజెపి ద్వంద వైఖరి ప్రదర్శిస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు దామల వెంకన్న, మాచారపు లక్ష్మణరావు, ములకల ఉత్తం, బండారు సారిక, నైనారపు నాగేశ్వరరావు, శ్రీకాంత్, బూర సత్యనారాయణ, కోడెం అంజి, సోమిరెడ్డి, సురేష్, సాంబయ్య, పాల్గొన్నారు.






