14-11-2025 12:58:50 AM
స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, నవంబర్ 13 (విజయక్రాం తి): జైనథ్‌లోని సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జాతర వేడుకల్లో భాగం గా స్వామి వారిని ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించాగా, ఆలయ పూజారి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యాలయంలో బీజేపీ నేతలు కరుణాకర్ రెడ్డి, రాకేష్‌రెడ్డి, రాందాస్, రమేష్, అశోక్ రెడ్డి, విజయ్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.