14-11-2025 12:57:42 AM
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం: ఎమ్మెల్యే అనిల్
నేరడిగొండ, నవంబర్ 13 (విజయక్రాంతి): మచ్చకారుల జీవితాల్లో వెలుగు నింపిన నాయకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. గురువారం మత్సకారుల ఉపాధి కోసం బజార్ హత్నూర్ మండలంలోని దేగామా చెరువులో చేప పిల్లలను ఎమ్మెల్యే విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ...
మచ్చకారుల జీవితాల్లో వెలుగు నింపి తెలంగాణలో రాష్ట్రం లో నీలి విప్లవానికి నాంది పలికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిన నాయకుడు కేసీఆర్‌అని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమానమైన న్యాయం చేశారని పేర్కొన్నారు. ఈ ప్రభు త్వం నిర్లక్ష్యనీ నిదర్శనమే ఈ రోజు చేప పిల్ల లు విడుదల అన్నారు. చేపలు పట్టే సమయంలో చేప పిల్లలు వదలడం ఏమిటి అని ప్రశ్నించారు.
అదేవిధంగా నేరడిగొండ, ఇచ్చోడ మం డల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మనబడి - మన నీరు కార్యక్ర మంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో ఇంకుడు గుం తల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ప్రతి ఒక్కరూ ప్రతి నీటి బొట్టును సంరక్షిస్తూ భావితరాలకు నీటి కొరత లేకుం డా చూడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రావు, పలువురు అధికారులు, మండల బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.