16-08-2025 06:40:47 PM
ఘట్ కేసర్: ఘట్ కేసర్, పోచారం మున్సిపల్స్ ప్రాంత ప్రజలు శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను వైభవోపేతంగా జరుపుకున్నారు. శ్రీకృష్ణుని వేషధారణలో బాలురు, గోపికల వేషధారణలో బాలికలు ఎంతో ఆకట్టుకున్నారు. యువజన సంఘాల ఆధ్వర్యాలలో కోలాటం, ఉట్టికొట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. యువకులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను వైభవంగా జరుపుకున్నారు.