16-08-2025 06:40:44 PM
మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సోయాబీన్ పంట నీట మునగడం జరిగింది. శనివారం చిన్న ఎక్లారా, అంతాపూర్, దన్నుర్ గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి రాజు(Mandal Agriculture Officer Raju) సోయాబీన్ నీట మునిగినా పంటలను పరిశీలించారు. వర్షం తగ్గినాక మరల పంటలను పరిశీలించి ఎంత మేర నష్టం వాటిల్లన్నేది నివేదికను పై అధికారులకు సమర్పిస్తామని తెలియజేయడం జరిగింది. మండల రైతులు ఈ సమయంలో ఎరువులు, పురుగు మందులను పిచికారి చేయొద్దని సూచించడం జరిగింది. వర్షం తగ్గినాక, పొలంలో నీటిని తీసివేసి వ్యవసాయ అధికారుల సూచనలతో నివారణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఈ వో అనిల్ , గ్రామ రైతులు పాల్గొన్నారు.