calender_icon.png 9 January, 2026 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్థాయి పోటీలో లలితకు ద్వితీయ బహుమతి

06-01-2026 12:16:59 AM

మహబూబ్‌నగర్‌టౌన్, జనవరి 5 : తెలంగాణ డిగ్రీ కళాశాలల బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్, మంథని  వారి ఆర్థిక సహకారంతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాస రచనా పోటీలో నాగర్కర్నూల్ జిల్లా, బిజినపల్లి మండలం, మంగనూరు గ్రామానికి చెందిన లలిత ద్వితీయ బహుమతి సాధించారు.

వ్యవసాయ కుటుంబానికి చెందిన అమిస్తాపూర్ సాయిలు, మంగమ్మ దంపతుల కుమార్తె అయిన లలిత ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్నారు. సావిత్రిబాయి ఫూలే జీవితం మరియు ఉద్యమం  సమకాలీన సమాజానికి ప్రాసంగికత అనే అంశంపై లలిత రచించిన వ్యాసం న్యాయనిర్ణేతలను ఆకట్టుకొని ఈ ఘన విజయం సాధించింది.

ఈ పోటీ గత నెల 28వ తేదీన నిర్వహించారు.  ఈ సందర్భంగా లలితకు రూ.25,000 నగదు బహుమతిని, మెమెంటో అందజేశారు. ఈ విజయాన్ని అభినందిస్తూ ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ అమీనా ముంతాజ్ జహాన్ మాట్లాడుతూ లలిత సాధించిన ఈ విజయం కళాశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. విద్యారంగంలో ఆమె మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బి.ఎ డిపార్ట్మెంట్ అధ్యాపకులు పాల్గొన్నారు.