06-01-2026 12:18:09 AM
జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్
గద్వాల, జనవరి 5 : జిల్లాలో అధికారులందరూ పూర్తి భాధ్యతతో పని చేసి ప్రజలకు మంచి సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులకు కోరారు. సోమవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ నందు జోగులాంబ గద్వాల జిల్లాలో రెండేళ్లపాటు సేవలందించిన జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్, ఐఏఎస్ గారిని జిల్లా అధికారులు, తహసీల్దార్లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లాలో జిల్లా కలెక్టర్గా రెండేళ్లపాటు సేవలందించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు.
క్షేత్ర స్థాయిలో పని చేయకముందు తాను జీహెచ్‌ఎంసీ, టీజీపీఎస్సీ వంటి సంస్థల్లో పని చేసిన అనుభవం ఉందని,జిల్లా కలెక్టర్గా తన మొదటి పోస్టింగ్ జోగులాంబ గద్వాల జిల్లానే కావడం తనకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందన్నారు.జిల్లా అభివృద్ధి కోసం తనకు సహకరించిన ప్రతి ఒక్క అధికారి, సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, జోగులాంబ గద్వాల జిల్లా తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే జిల్లాగా నిలిచిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ, నర్సింగ రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస రావు,ఆర్డీఓ అలివేలు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.