08-05-2025 12:56:25 AM
బోథ్, మే 7 (విజయక్రాంతి): ఎస్టీ జాబి తా నుండి లంబాడాలను తొలగించేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వాన అధ్యక్షుడు గోడం గణేష్ అన్నారు. గతంలో లంబాడాలకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమంలో భాగంగా తుడుం దెబ్బ నాయకులపై పెట్టిన కేసుల విషయమై బుధవారం బోథ్ కోర్టుకు హాజరైన సందర్భంగా తుడుం దెబ్బ నాయకు లతో కలిసి ఆయన మీడియాలో మాట్లాడారు.
ఎన్ని అక్రమ కేసులు బనాయించిన వెనక్కి తగ్గేదే లేదని, ఎన్ని కేసులునైనా ఎదుర్కొంటామన్నారు. కోర్టుకు హాజరైన వారిలో తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు కోడప నగే ష్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కుడాల స్వామి, జిల్లా నాయకులు రామేల్లి భోజ్జన్న, ఐటీడీఏ మాజీ డైరెక్టర్ మెస్రం భూమన్న, కుర్మే రాజన్న తదితరులు పాల్గొన్నారు.