calender_icon.png 9 May, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తిశ్రద్ధలతో వాసవీమాత జయంతి

08-05-2025 12:58:03 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే7(విజయక్రాంతి): వాసవీ కనక పరమేశ్వరి జయంతి వేడుకలను ఆలయ కమిటీ, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బుధవారం ఆసిఫా-బాద్ పట్టణం లోని వాసవీ ఆలయంలో అర్చకులు రాజశేఖర్ శర్మ, శేఖర్ శర్మ, నరేష్ శర్మ ఆధ్వ-ర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అష్టాదశ హారతులు ఇచ్చారు.

వాసవి మాత జయంతిని పురస్కరించుకొని ఆలయంలో అభిషేకాలు చేపట్టారు. కుంకుమ పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం పట్టణంలోని పురవీధుల గుండా అమ్మవారి ఉత్సవ విగ్ర-హంతో శోభాయాత్ర నిర్వహించారు. ఆలయంలో అమ్మవారి ఉయ్యాల సేవ అనంతరం భక్తులకు మహాన్నదానం కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ అధ్యక్షుడు రావుల శంక ర్, కార్యదర్శి వెంకన్న, కోశాధికారి మురళి, వాసవి క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు  పాత శ్రీనివాస్ కృష్ణమూర్తి, కిషోర్, గంధం శ్రీనివాస్, వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు