calender_icon.png 9 May, 2025 | 9:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సార్వత్రిక సమ్మెలో సమైక్యంగా పాల్గొందాం

08-05-2025 12:54:31 AM

-కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు

ముషీరాబాద్, మే 7 (విజయక్రాంతి):  మే 20 న జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లోని బిజెపి విధానాలపై సామాజిక శక్తులుగా సమైక్యంగా సార్వత్రిక  సమ్మెలో పాల్గొందామని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ.స్కైలాబ్ బాబు పలు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

ఈ మేరకు బుధవారం బాగ్ లిం గంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మనువాద కార్పొరేట్ విధానాలను ప్రతిఘటించి, రాజ్యాంగ హక్కులను రక్షించుకుందా మని, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సామాజిక సంఘాల నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు మాట్లాడుతూ స్వాతంత్రం కంటే ముందు నుండి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను బీజేపీ సర్కార్ రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చిందన్నారు. ఆర్టికల్ 19 ప్రకారం సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కు కనీస వేతనం పొందే హక్కుల నుండి కార్మికులను దూరం చేస్తుందన్నారు. తన మతన్మాద కార్పొరేట్ విధానాలతో రాజ్యాంగ విరుద్ధంగా కార్మిక హక్కులను కాలరాస్తుందన్నారు.

ఇందుకుగాను తమ కార్యాచరణ ప్రకారం మే 8 నుండి 15 వరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు, మే 16 నుండి 19 వరకు అసంఘటిత రంగ కార్మికుల విస్తృత ప్రచారం, ప్రెస్ మీట్ లు, సామాజిక మధ్య మాల్లో విస్తృత ప్రచారంలతో పాటుగా మే 20న సార్వత్రిక సమ్మెలో సామాజిక సంఘాల ప్రత్యేక బ్యానర్ తో జెండాలు కండువాల ప్రదర్శనతో పాల్గొననున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమములో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు, తెలంగాణ సోషల్ డెమోక్రసీ ప్రంట్ జేఏసీ కన్వీనర్ కోల జనార్ధన్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీ జంగారెడ్డి, బీసీ సంఘం నాయకు లు జీ శ్రీహరి, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మానాయక్, డీవైఏఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి రాజు నరేష్, తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర నాయకులు కొమ్ము తిరుపతి, సీఐటీ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు, ఐదవ రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు జి విజయ్ కుమార్, సీనియర్ కార్మిక నాయకులు పిఎన్ మూర్తి, కెవిపిఎస్ రాష్ట్ర నాయకులు ఎం ప్రకాష్ శరత్, ఎం దశరథ్ తదితరులు పాల్గొన్నారు.