calender_icon.png 13 July, 2025 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాజెక్టుల భూసేకరణకు స్పీడు పెంచాలి

13-07-2025 01:28:20 AM

  1. పునరావాస పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
  2. అధికారులకు మంత్రి ఉత్తమ్‌కుమార్ ఆదేశాలు

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): రాష్ర్టంలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. పునరావాస పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. శనివారం సచివాలయంలో నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని చట్టప రమైన, పాలనాపరమైన అంశాలను తక్షణమే పరిష్కరించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఇటు భూసేకరణ, అటు పునరావాస పనుల్లో జాప్యం లేకుండా సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు. జిల్లాల వారీగా ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించిన ఆయన నిర్మాణంలో ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించేందుకు అధికార యంత్రాం గం పనిచేయాలన్నారు.

భూసేకరణలో జరుగుతున్న జాప్యంతో అంచనాలపై ప్రభావం చూపుతూ రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు. భూసేకరణలో ఎదుర వుతున్న ఆటంకాలను అధిగమించేందుకు భూములు కోల్పోయే రైతులతో సహృద్భావ చర్చలు జరపాలన్నారు. నష్టపరిహారం, పునరావాసం వంటి అంశాలపై పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

ఎక్కడ నిర్లక్ష్యం వహిం చినా ప్రజావ్యతిరేకతతో పాటు న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయని, అటు వంటి సునిశితమైన అంశాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఏజెన్సీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పనులను వేగవంతం చేయాలని తెలి పారు. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టుల పూర్తికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాష్ర్టంలోని జలాశయాలలో పెరుగుతున్న నీటి మట్టాలపై ఆరా తీశా రు. అధికారులు అప్రమత్తంగా ఉం డాలని ఎప్పటికప్పుడు నీటి మట్టాలను గమనించాలన్నారు. 

 నీటిపారుదల శాఖలోకి ఆర్మీ ఇంజినీర్లు

రాష్ర్టంలోని ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణాలలో టన్నెల్ నిర్మాణాలు కీలకంగా మారాయని మంత్రి పేర్కొన్నారు. అటువంటి టన్నెల్ నిర్మాణా లలో అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు భార త సైన్యంలో పనిచేస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ నిపుణులను తెలంగాణ నీటిపారుదల శాఖలో చేర్చుకోబోతున్నట్లు వెల్లడించారు.

భారత సేన మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ జనరల్ హార్బల్ సింగ్ నీటిపారుదల శాఖలో గౌరవ సలహాదారుగా, అంతర్జాతీ య స్థాయిలో టన్నెల్ ఇంజినీరింగ్ నిపుణుడిగా ప్రసిద్ది చెందిన కల్నల్ పరిక్షిత్ మెహ్రా నీటిపారుదల శాఖ ల్లో చేరునున్నట్లు తెలిపారు. దేశంలో అత్యంత క్లిష్టమైన రోహ్తంగ్, జోజిలా టన్నెల్ నిర్మాణంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారని వెల్లడించారు.

రాజేంద్రనగర్‌లోని వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌ను మరింత బలోపేతం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. సాగునీటి నిర్వహణలో శిక్షణతోపాటు పరిశోధనకు కీలక కేంద్రంగా ఉందన్నారు. అటువంటి ఇనిస్టిట్యూట్‌కు చెందిన భూమి కబ్జాకు గురైందని, తక్షణమే సర్వే జరిపి అక్రమ నిర్మాణాలను తొలగించాలన్నారు. సకాలంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పా టు ప్రజాధనాన్ని సమర్థవంతంగా సద్వినియోగం చేయడమే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.