13-09-2025 01:40:22 AM
మంథని,సెప్టెంబర్ 12(విజయ క్రాంతి) మంథని శివ్వారం మధ్య గోదావరి నదిపై నిర్మించే వంతెన నిర్మాణము వల్ల మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా మధ్య దూరం తగ్గి రెండు ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని. కానీ బ్రిడ్జ్ రోడ్డు విస్తరణలో భాగంగా గోదావరి తీరములో ఉన్న పురాతన గౌత మేశ్వర, రామాలయ దేవాలయాలకు ఏలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని భూ యజమానులు శుక్రవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు వినతిపత్రం అందజేశారు.
వారు తెలిపిన వివరాల ప్రకారం ఈ భూములు సారవంతమైన రెండు, మూడు పంటలు పండేటివని, గోదావరి పరిసర ప్రాంత భూ ములకు గోదావరి నది నుండి వ్యవసాయ భూములకు మో టర్ పైపు లైన్ లు, బోరు బావుల పైపులైన్ లు ఉన్నాయని, కావున మా యొక్క భూములు పోకుండా అలైన్ మెంట్ గుడి దగ్గరి నుండి,పాత రోడ్డుకు మార్చుటకు సాధ్యమైనంత వరకు ప్రయత్నము చేయలని, అలా సాధ్యము కానిచో ప్రస్తుతము న్న మార్కెట్ రేటుకు పది రెట్లు పరిహరము ఇప్పించుటకు ప్ర త్యేక చొరవ చూపాలని శ్రీధర్ బాబుకు భూములు కోల్పోతు న్న వారు విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పోరెడ్డి ఉమ, ఎక్కేటి శరత్ రెడ్డి, ఎక్కెటి అనంతరెడ్డి, గట్టు సుశీల, గట్టు కిట్టన్న, బొబ్బిలి శ్రీధర్, మోతెరాంగారి రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.