calender_icon.png 7 November, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యవర్తిత్వ శిక్షణ పూర్తిచేసిన న్యాయవాదులు

07-11-2025 12:00:00 AM

నిజామాబాద్ లీగల్ కరెస్పాండెంట్, నవంబర్ 6 (విజయ క్రాంతి): నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల శ్రీధర్, న్యాయవాదులు సుమలత, ధర్మయ్య లు నిర్మల్ జిల్లాకోర్టు ప్రాంగణంలోని సమావేశపు హల్ ఐదు రోజుల మధ్యవర్తిత్వపు శిక్షణను పూర్తి చేశారు.

ప్రారంభ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్, న్యాయసేవ అధికార సంస్థ రాష్ట్ర మెంబర్ సెక్రటరీ పంచాంక్షరీ న్యాయ వివాదాలను మధ్యవర్తిత్వపు చట్టం ద్వారా ఎలా పరిష్కరించుకోవాలి అనే అంశాలను తెలిపారు. చివరి రోజైన గురువారం నిర్మల్ జిల్లాజడ్జి శ్రీవాణి న్యాయసేవ సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి రాధిక హాజరయ్యారు.

ఐదు రోజుల మధ్యవర్తిత్వపు శిక్షణకు తమిళనాడు రాష్ట్ర చెన్నై హైకోర్టు న్యాయవాదులు అరుణాచలం, ససిద దేవి పాల్గొని శిక్షణ కార్యక్రమాల వివరాలు వివరించారు. మధ్యవర్తిత్వo అనే చట్టం పూరాతన పాలన పద్ధతుల అధ్యయనం, వివిధ దేశాలలో అమలు జరిగిన పద్ధతులను విశ్లేశించి తయారు చేశారని తెలిపారు. శిక్షణ ముగ్గుంపు కార్యక్రమంలో మాణిక్ రాజు, శ్రీధర్, సుమలత, ధర్మయ్య లకు మధ్యవర్తిత్వ ధ్రువ పత్రాలను నిర్మల్ జిల్లాజడ్జి శ్రీవాణి అందజేశారు.

తెలంగాణలోని ఐదు జిల్లాల నుండి 52 మంది న్యాయవాదులు మధ్యవర్తిత్వపు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారని బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు తెలిపారు. చాలా విలువైన చట్టపు విజ్ఞానాన్ని తెలుసుకున్నామని, కోర్టులలో దాఖలైన కేసులలో చాలామట్టుకు మధ్యవర్తిత్వం నేరపడం వలన పరిష్కరించవచ్చని ఆయన అన్నారు.