07-11-2025 12:00:00 AM
ఎమ్మెల్సీ అంజిరెడ్డి
కామారెడ్డి, నవంబర్ 6 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం లో సిద్దుల గుట్ట శ్రీసిద్ధేశ్వర స్వామి వారి 34వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న కార్తీక పౌర్ణమి బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి గురువారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ చిన్నమలై గోదావరి అంజి రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు డా పైడి ఎల్లారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవాలకు ప్రతిఒక్కరు కుటుంబంతో వచ్చి ఆ భగవంతుడు ఆశీస్సులు అందుకొవలని ఆకాంక్షిస్తున్నాము. అలాగే స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరికీ ఆరోగ్యము, ఆనందము, శ్రేయస్సు కలగాలని కోరుకుంటున్నాము సుమారు పదివేల మందికి అన్న ప్రసాద వితరణ చేయడం సంతోషమని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిన్న రాజులు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు, మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ లింగారావు మండలాల అధ్యక్షులు జిల్లా నాయకులు మండల నాయకులు, పరిసర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
పైడి ఎల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన బిజెపి రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి నాయకత్వంలో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.