calender_icon.png 25 October, 2025 | 12:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధుల్లో అలసత్వం తగదు

23-10-2025 12:54:05 AM

  1. ప్రిన్సిపాళ్లు స్వయంగా పర్యవేక్షించాలి
  2. మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి) : ఇటీవల గురుకులాల్లో జరిగిన వరుస సంఘటనలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, ఎక్క డైనా పొరపాటు జరిగి నిర్లక్ష్యం జరిగితే కఠిన చర్యలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను హెచ్చరించారు. మహాత్మా జ్యోతిరా వు పూలే గురుకుల పాఠశాలలపై మంత్రి పొ న్నం ప్రభాకర్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో బీసీ గురుకులాల సెక్రటరీ సైదులు, అడిషనల్ సెక్రెటరీలు, ఆర్సీవోలు, ప్రిన్సిపాల్‌లు పాల్గొన్నారు.

ఈ సంద ర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పాఠశాల ప్రాంగణాల్లో బుష్ క్లియరెన్స్ చేసుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిం చాలన్నారు. అన్ని పాఠశాలలు, కళాశాలలు 100 శాతం ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రిన్సిపల్‌లు, ఫ్యాకల్టీ నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్య లు తీసుకోవాలని, ప్రిన్సిపాల్ లు స్వయంగా విధులు పర్యవేక్షించాలన్నారు.

ప్రాంతీయ సమన్వయ అధికారులు పాఠశాలలు ,కళాశాలలు ఆ కస్మిక తనిఖీలు చేయాలని, విద్యార్థుల క్రమశిక్షణపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించా రు. నిర్దేశిత ఆహార మెనూను కచ్చితంగా అమ లు చేయాలని, విద్యార్థుల వాష్ రూమ్స్  క్రమం తప్పకుండా శుభ్రపరచాలని ఆదేశించారు.

ప్రజా ప్రతినిధులు విధిగా గురుకుల హాస్టల్ లు సందర్శించాలని, పిల్లలను అనుమతి లేకుండా బయటకు పంపించడానికి లేదన్నారు. నైట్ డ్యూటీలో ఉన్న టీచర్ విధిగా అన్ని రూమ్‌లు పరిశీలిస్తూ ఉండాలని, స్టడీ అవర్స్‌లో విద్యార్థులపె దృష్టి సారించాలన్నారు. కౌన్సిలింగ్ కార్యక్రమాలు విధిగా నిర్వహించాలన్నారు.