10-08-2025 10:19:59 PM
నకిరేకల్,(విజయక్రాంతి): నకిరేకల్ పట్టణంలోని గీతకార్మిక సహకార సంఘ భవన నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుతూ ఆదివారం భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్ గౌడ్, గీత కార్మిక సహకార సంఘ అధ్యక్షులు కొండ వెంకన్న గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. భవన నిర్మాణం పూర్తి చేయుటకు నిధులు వెచ్చించాలని ఆయనను కోరారు.వారి వెంట కార్మిక సహకార సంఘ ఉపాధ్యక్షులు చౌగోని వెంకన్న గౌడ్, కార్యదర్శి మల్లెబోయిన దశరథ కోశాధికారి చౌగోని నాగయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.